గుడ్ న్యూస్:  భారీగా తగ్గిన పుత్తడి ధరలు 

గుడ్ న్యూస్:  భారీగా తగ్గిన పుత్తడి ధరలు 

దేశంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి.  ఇప్పటికే భారీగా తగ్గిన ధరలు ఈరోజు కూడా తగ్గుముఖం పట్టడం విశేషం.  అంతర్జాతీయంగా ధరలు తగ్గడమే ఇందుకు కారణమని నిపుణులు చెప్తున్నారు.  దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో పాటుగా కేంద్రం బడ్జెట్ లో ప్రోత్సాహకాలు ప్రకటించండంతో ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పొచ్చు.  ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గి రూ.42,690 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.610 తగ్గి రూ.456,570 కి చేరింది.  వెండిసైతం బంగారం బాటలోనే పయనించింది.  కిలో వెండి ధర రూ.800 తగ్గి రూ.72,500కి చేరింది.