భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. అదేదారిలో వెండి...

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌.. అదేదారిలో వెండి...

నిన్న కాస్త కింద‌కి దిగిన బంగారం ధ‌ర.. మ‌ళ్లీ భారీగా పెరిగింది.. ఇక వెండి కూడా బంగారం దారిలోనే పైకి ప‌రుగులు పెట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గినా.. దేశీమార్కెట్‌లో అమాంతం పెరిగింది.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 ఎగ‌బాకి.. రూ.47,550కు చేర‌గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.450 పెర‌గ‌డంతో రూ.48,750కు ఎగసింది. ఇక వెండి మాత్రం భారీగా పెరిగింది.. రూ.1500 పెర‌గ‌డంతో.. కిలో వెండి రూ.50,050కి అమ్ముడుపోతోంది.

మ‌రోవైపు, హైద‌రాబాద్‌ మార్కెట్‌లో.. ఢిల్లీ మార్కెట్ కంటే ఎక్కువ‌గా పెరిగింది ప‌సిడి.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.470 పెర‌గ‌డంతో.. రూ.46,740కు చేరుకోగా.. ఇదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.470 పెరిగింది.. దీంతో.. 10 గ్రాముల బంగారం ధ‌ర ఏకంగా రూ.50,950కు ప‌రుగులు పెట్టింది.. ఇక‌, వెండి ధ‌ర జిగేల్ మంది.. కేజీ వెండి ధర ఏకంగా రూ.1500 పెర‌గ‌డంతో.. కిలో వెండి రూ.50,050గా ప‌లుకుతోంది. కానీ, అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ప‌రిస్థితి వేరుగా ఉంది.. బంగారం ధ‌ర ఔన్స్‌కు 1.20 శాతం త‌గ్గ‌డంతో.. బంగారం ధర ఔన్స్‌కు 1779 డాలర్లకు పడిపోయింది.