మహిళలకు శుభవార్త: భారీగా తగ్గిన బంగారం ధరలు
లాక్ డౌన్ తరువాత బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయంగా మార్కెట్లు కోలుకోవడంతో పాటుగా అంతర్జాతీయంగా బంగారం ధరలకు డిమాండ్ తగ్గడంతో దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర. 300 తగ్గి రూ.47,000కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గి రూ.51,340కి చేరింది. ఇక వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.1600 తగ్గి రూ.66,700కి చేరింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)