గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధరలు... 

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం ధరలు... 

అంతర్జాతీయంగా బంగారం ధరలు కొద్దిమేర తగ్గుముఖం పట్టాయి.  అంతర్జాతీయంగా ధరలు తగ్గిపోవడంతో, దేశీయంగా కూడా ధరలు  తగ్గుముఖం పట్టాయి.  దేశరాజధాని ఢిల్లీ నగరంలో ఈ ధరలు భారీగా తగ్గాయి.  ఢిల్లీ మార్కెట్లో  శుక్రవారం రోజున బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 తగ్గి రూ.46,800కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 తగ్గి రూ.48,060కి చేరింది.  ఇక వెండి ధర కూడా భారీగా తగ్గింది.  కిలో వెండి ధర ఏకంగా రూ.850 తగ్గి  రూ.47,600కి చేరింది.  దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.48వేలు ఉంటె, హైదరాబాద్ మార్కెట్లో మాత్రం రూ.50వేలకు పైగా ఉండటం విశేషం.