బ్యాడ్ న్యూస్: రెక్కలు తొడిగిన బంగారం... 

బ్యాడ్ న్యూస్: రెక్కలు తొడిగిన బంగారం... 

గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.  అయితే, ఇలా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు తిరిగి పుంజుకున్నాయి. క్రమంగా పెరగడం మొదలుపెట్టాయి.  కరోనా వైరస్ వలన మరణాలు పెరగడంతో చాలామంది తమ డబ్బును బంగారంలో పెట్టుబడిగా పెడుతున్నారు.  అదే విధంగా అంతర్జాతీయంగా కూడా బంగారానికి కొంతమేర పెరగడంతో దేశీయంగా కూడా బంగారం కొద్దిగా పెరుగుదల కనిపించింది. 

ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర. రూ. 240కి పెరిగి రూ. 38,880కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.  240 పెరిగి రూ. 42,390కి చేరింది.  ఇక ఇదే బాటలో వెండి కూడా పయనించింది.  కిలో వెండి సుమారుగా రూ. 200 పెరిగి రూ. 49,000కు చేరుకుంది.