గుడ్‌ న్యూస్‌ : వరుసగా ఐదో రోజూ పడిపోయిన బంగారం ధరలు...

గుడ్‌ న్యూస్‌ : వరుసగా ఐదో రోజూ పడిపోయిన బంగారం ధరలు...

పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత ఐదు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీపావళి తర్వాత ఈ పరిస్థితి నెలకొంది. కరోనా నేపథ్యం తర్వాత మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది.   అయితే... తాజాగా  బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్నటి రోజున బంగారం ధరలు తగ్గగా.. ఈరోజు కూడా ధరలు భారీగా తగ్గాయి.  అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా తగ్గడం వలన దేశీయంగా కూడా ధరలు కూడా తగ్గినట్టు నిపుణులు చెప్తున్నారు.  తగ్గిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.46, 900 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 51, 240 కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ.66, 500కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం దీనికి ఒక కారణమైతే, కోవిడ్ తరువాత ప్రపంచ మార్కెట్లు తిరిగి కోలుకోవడం మరొక కారణం అని నిపుణులు చెప్తున్నారు.