మహిళలకు శుభవార్త : భారీగా పడిపోయిన బంగారం ధరలు

మహిళలకు శుభవార్త : భారీగా పడిపోయిన బంగారం ధరలు

పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గత ఐదు రోజులుగా బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. దీపావళి తర్వాత ఈ పరిస్థితి నెలకొంది. కరోనా నేపథ్యం తర్వాత మామూలు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగి పోయాయి. 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది.   అయితే... తాజాగా  బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్నటి రోజున బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా.. ఈరోజు  ధరలు భారీగా తగ్గాయి.  అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా తగ్గడం వలన దేశీయంగా కూడా ధరలు కూడా తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు.  తగ్గిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 450 తగ్గి రూ.45, 000 కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 తగ్గి రూ. 49, 090 కి చేరింది. ఇక కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు జరగలేదు.  ప్రస్తుతం కిలో వెండి ధర రూ.64, 700 కి చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం దీనికి ఒక కారణమైతే, కోవిడ్ తర్వాత ప్రపంచ మార్కెట్లు తిరిగి కోలుకోవడం మరొక కారణం అని నిపుణులు చెబుతున్నారు.