నిలకడగా బంగారం... ఎగిసిపడ్డ వెండి ధరలు

నిలకడగా బంగారం... ఎగిసిపడ్డ వెండి ధరలు

మన దేశంలో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు మాత్రం నిలకడగా ఉన్నాయి. అయితే.. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.   ఈరోజు హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,250 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,290 వద్ద ఉన్నది.  బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుంటే, వెండి మాత్రం షాక్ ఇచ్చింది.  కిలో వెండి ధర మార్కెట్లో ఏకంగా రూ. 700 పెరిగింది.  కిలో వెండి ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 74,600 వద్ద ఉన్నది.