దిగొచ్చిన బంగారం... 

దిగొచ్చిన బంగారం... 

గత కొంతకాలంగా ఇండియాలో బంగారం వెండి ధరలు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.  అయితే ఈ ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి.  దీనికి అనేక కారణాలు ఉన్నాయి.  అంతర్జాతీయంగా బంగారంపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పాటుగా దేశంలో రూపాయి విలువ పెరగడం కూడా ఒక కారణం కావొచ్చు.  అదే విధంగా దేశంలో బంగారంపై వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం కూడా ధరలపై ప్రభావం చూపుతున్నది.  

ఇక హైదరాబాద్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 360 తగ్గి, రూ. 40,610కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 360 తగ్గి రూ. 44,340కి చేరింది.  ఇదే బాటలో వెండి కూడా పయనించింది.  కిలో వెండి ధర రూ. 200 తగ్గి, రూ.49,800కి చేరింది.