భారీగా పెరిగిన బంగారం ధరలు... 

భారీగా పెరిగిన బంగారం ధరలు... 

గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.  అంతర్జాతీయంగా బంగారం ధరల్లో వస్తున్న మార్పులు, అమెరికా చైనా మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితులు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.  గత 8 రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి.  9 వ రోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.  హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 290 పెరిగి రూ.51,030కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 290 పెరిగి రూ.55,600కి చేరింది.  ఇది ఆల్ టైమ్ రికార్డ్ ధర అని చెప్పుకోవాలి.  బంగారం ధరలు పెరిగితే, వెండిమాత్రం తగ్గుముఖంపట్టింది .  కిలో వెండి ధర రూ. 3050 తగ్గి రూ. 63,000కి చేరింది.