మళ్ళీ పెరిగిన బంగారం ధరలు... 

మళ్ళీ పెరిగిన బంగారం ధరలు... 

ఇండియాలో బంగారానికి డిమాండ్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  ధర పెరిగినా సరే బంగారాన్ని అధికంగా కొనుగోలు చేస్తుంటారు.  రెండు రోజుల క్రితం వరకు కొంతమేర తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు  తాజాగా తిరిగి పెరగడం మొదలుపెట్టాయి.  వరసగా రెండో రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి.  తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరిగి రూ.49,250కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరిగి రూ.53,720కి చేరింది.  ఇక ఇదిలా ఉంటె, బంగారంతో పాటుగా వెండి ధర కూడా పెరిగింది.  కిలో వెండి ధర రూ.660 పెరిగి రూ.68,560కి చేరింది.