మహిళలకు గుడ్ న్యూస్ : భారీగా పడిపోయిన పసిడి ధరలు
దేశంలో బంగారం ధరలు మళ్లీ దిగివస్తున్నాయి. గత నాలుగు రోజులు పసిడి ధరలు పెరిగిన విషయం తెలిసిందే.. తాజాగా ఇవాళ భారీగా పడిపోయాయి బంగారం ధరలు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆకాశాన్ని తాకిన ధరలు, ఆ తరువాత మార్కెట్లు తిరిగి కోలుకొని పుంజుకోవడంతో ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు తగ్గడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. ఆదివారం రోజున హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 45,900 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 50, 070 కి చేరింది. బంగారం ధరలు తగ్గితే... వెండి ధర మాత్రం పెరిగిపోయింది. ఇవాళ వెండి ధర రూ. 200 పెరగడంతో రూ. 67,500 కు చేరుకుంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)