రూ.33,000 దాటిన బంగారం, పెరిగిన వెండి మెరుపులు

రూ.33,000 దాటిన బంగారం, పెరిగిన వెండి మెరుపులు

ప్రపంచ మార్కెట్లలో బలపడటం, నగల ఉత్పత్తిదారుల నుంచి డిమాండ్ పెరగడంతో సోమవారం ఢిల్లీ సరాఫా బజార్ లో బంగారం పది గ్రాముల ధర రూ.425 పెరిగి రూ.33,215కి చేరినట్టు అఖిల భారత సరాఫా సంఘం తెలిపింది. మరోవైపు పారిశ్రామిక సంస్థలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో కిలో వెండి ధర రూ.170 పెరిగి రూ.38,670కి చేరింది.

ప్రపంచ మార్కెట్లలో బలపడుతున్న సూచనలు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ లో పుత్తడి ఔన్స్ ధర 1,298.30 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. వెండి కూడా పెరిగి ఔన్స్ ధర 15.23 డాలర్లుగా ఉంది.

ఢిల్లీ సరాఫా బజార్ లో 99.9 శాతం, 99.5 శాతం శుద్ధమైన బంగారం ధర రూ.425-రూ.425 పెరిగి పది గ్రాముల ధర వరుసగా రూ.33,215, రూ.33,045కి చేరింది. శనివారం బంగారం ప్రతి పది గ్రాముల ధర రూ.32,790 దగ్గర ముగిసింది. ఎనిమిది గ్రాముల గినియా ధర యూనిట్ కు రూ.26,400గా ఉంది.

వెండి ధర రూ.170 పెరిగి కిలోగ్రాము ధర రూ.38,670కి చేరింది. వీక్లీ డెలివరీ కిలోగ్రాముకి రూ.594 లాభంతో రూ.37,753కి చేరుకుంది. 100 వెండి నాణాల కొనుగోలు ధర రూ.80,000గా అమ్మకం ధర రూ.81,000 దగ్గర స్థిరంగా ఉంది.