దివాలీ ట్రేడింగ్ లో కళ తప్పిన బంగారం

దివాలీ ట్రేడింగ్ లో కళ తప్పిన బంగారం

బుధవారం జరిగిన దివాలీ ముహురత్ ట్రేడింగ్ లో బంగారం కళ తప్పింది. 10 గ్రాముల బంగారం రూ.210 తగ్గి రూ.32,400కి చేరింది. వెండి ధర కూడా బాగా పడిపోయింది. కిలో వెండి రూ.300 కోల్పోయి రూ.39,000 దగ్గర నిలిచింది. దీపావళి కొనుగోళ్లు పెద్దగా లేకపోవడంతో నగల వర్తకులు, రీటెయిలర్స్ శుభప్రద సూచనగా నామమాత్రంగా బంగారం కొనుగోలు చేసి ఊరుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని బులియన్ ట్రేడర్లు చెబుతున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు 0.51% పెరిగాయి. ఔన్స్ బంగారం ధర 1,233.80 డాలర్లు పలికింది. వెండి కూడా బంగారం బాటనే నడిచింది. ఔన్స్ వెండి 0.17% పెరిగి 14.77 డాలర్లకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9%. 99.5% శుద్ధమైన బంగారం 10 గ్రాములకు రూ.210 తగ్గి రూ.32,400, రూ.32,250 కి చేరాయి.

సవరు కూడా బలహీనపడింది. 8 గ్రాముల బంగారం రూ.100 తగ్గి రూ.24,800 గా నమోదైంది.