హైదరాబాద్ లో కరోనా బాధితుడి బర్త్ డే..హాజరైన మంత్రులు,ఎమ్మెల్యే లు..!

 హైదరాబాద్ లో కరోనా బాధితుడి బర్త్ డే..హాజరైన మంత్రులు,ఎమ్మెల్యే లు..!

హైదరాబాద్ లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రతి రోజు రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. దాంతో నగరంలో పుట్టినరోజు వేడుకలు,పార్టీలు నిర్వహించకూడదని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. అయినప్పటికీ కొంతమందిలో మాత్రం మార్పు రావటంలేదు. పార్టీలు జరుపుకి కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల హిమాయత్ నగర్ లో ఓ వజ్రాల వ్యాపారి (63) పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు బంగారు వర్తకులు కలిసి మొత్తం100 మందికిపైగా హాజరయ్యారు. కాగా పార్టీ జరిగిన రెండురోజులు వ్యాపారి అస్వస్థతకు గురయ్యాడు. దగ్గు, ఆయాసంతో బాధపడుతుండడంతో ఓ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. దాంతో వ్యాపారి ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరగా కరోనా పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. పరిస్థితి అప్పటికే విషమించడంతో ఆ మరుసటి రోజే అతడు మరణించాడు.తర్వాత 5 రోజులకే పార్టీలో పాల్గొన్న జువెలరీ అసోసియేషన్ ప్రతినిధి కూడా కరోనా తో మృతిచెందాడు. అంతే కాకుండా ఇప్పటివరకు పార్టీకి హాజరైన 20మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కాగా ఈ వేడుకలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు రహస్యంగా కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తోంది.