గుడ్‌న్యూస్: పసిడి పరుగులకు బ్రేక్... దిగివచ్చిన బంగారం ధర
పరుగులు పెడుతూ ఆల్‌టైం హై రికార్డులను సృష్టించిన బంగారం ధర.. అప్పుడప్పుడు శుభవార్త చెబుతూ.. కాస్త తగ్గుతోంది.. బంగారం కొనుగోలు చేయాలని భావించేవారికి ఊరట కల్పిస్తూ.. మరోసారి తగ్గింది పసిడి ధర.. ఇదే, సమయంలో వెండి మాత్రం మరింత పైకి ఎగబాకింది.. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర తగ్గుదల కారణంతోనే.. దేశీయా మార్కెట్లో బంగారం దిగివచ్చిందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.180 తగ్గింది.. దీంతో.. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ.46,270కు చేరింది.. ఇక, 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.180 తగ్గడంతో.. 10 గ్రాముల బంగారం ధర రూ.50,480కు పడిపోయింది.. ఇదే.. సమయంలో.. వెండి ధర మాత్రం కాస్త పైకి ఎగబాకింది.. రూ.50 పెరగడంతో.. కిలో వెండి ధర రూ.48,550కు చేరింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర కిందకు దిగింది.. పసిడి ధర ఔన్స్‌కు 0.13 శాతం తగ్గడంతో.. బంగారం ధర ఔన్స్‌కు 1778 డాలర్లకు పడిపోయింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)