భారీగా దిగొచ్చిన బంగారం ధర

భారీగా దిగొచ్చిన బంగారం ధర

పసిడి ధర దిగివచ్చింది. వరుసగా రెండో రోజు బంగారం ధర తగ్గింది. గత రెండు నెలల్లో 2 వేల రూపాయలకు పెగా పతనమైంది. ఇటీవల కాలంలో అడ్డూ అదుపూ లేకుండా దూసుకెళ్లిన్న బంగారం ధర... ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. మరో వైపు వెండి ధర కూడా తగ్గుతోంది. గత సెప్టెంబర్‌లో 40 వేల రూపాయల మార్కును దాటిన పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం... ఇప్పుడు 38 వేల రూపాయల స్థాయికి దిగివచ్చింది. అలాగే, పది గ్రాముల 22 క్యారెట్ల పసిడి 34 వేల 900 రూపాయలుగా ఉంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరపడే సూచనలు కనిపిస్తుండడంతో మళ్లీ పెట్టుబడులు బంగారం నుంచి ఈక్విటీ మార్కెట్లవైపు మళ్లుతున్నాయి.

ఇది బంగారం ధర పతనానికి దారితీస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 14 వందల 67 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్‌కు తోడు దేశీయంగా నగల వ్యాపారులు, వినియోగదారుల నుంచి డిమాండ్‌ తగ్గడంతో పసిడి ధర పతనమౌతోంది. వెండి ధర కూడా భారీగానే తగ్గుతోంది. ప్రస్తుతం కేజీ వెండి 44 వేల రూపాయలుగా ఉంది. అలాగే, అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి 17 డాలర్లకు లోపే ఉంది. ఫ్యూచర్స్‌ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి. ఈ పతనం మరింత కొంత కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.