వినియోగదారులకు మళ్ళీ షాకిచ్చిన పసిడి... 

వినియోగదారులకు మళ్ళీ షాకిచ్చిన పసిడి... 

పసిడి ధరలు వినియోగదారులకు షాకిస్తూనే ఉన్నాయి.  ఒకరోజు తగ్గితే వారం రోజులపాటు ధరలు పెడుతున్నాయి.  దీంతో బంగారం కొనాలి అంటే వినియోగదారులు ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  నిన్నటి రోజున తగ్గిన బంగారం ధరలు ఈరోజు  మళ్ళీ పెరిగాయి.   హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి.  

10 గ్రాముల 22  క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.46,350కి చేరింది.  10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరిగి రూ. 50,560కి చేరింది.  బంగారం ధరలు పెరిగినప్పటికీ వెండి మాత్రం పెరగలేదు.  పైగా కొంతమేర తగ్గింది.  కిలో వెండి ధర రూ. 50 తగ్గి రూ.48,450కి చేరింది.  అయితే, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి.  పసిడి ధర ఔన్స్ కు 0.10 శాతం క్షిణించింది.  అంతర్జాతీయంగా ధరలు తగ్గినా ఇండియాలో మాత్రం ధరలు పెరగడం విశేషం.