మళ్ళీ పడిపోయిన బంగారం... 

మళ్ళీ పడిపోయిన బంగారం... 

భారతీయులు బంగారంలో ఎక్కువ పెట్టుబడులు పెడుతుంటారు.  ప్రపంచంలో అత్యధికంగా బంగారం వినియోగించే దేశాల్లో ఇండియా ఒకటి.  భారీస్థాయిలో ఇండియా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది.  దిగుమతి అధికంగా చేసుకుంటుంది కాబట్టే ఇక్కడ ధరలు ఆకాశంలో ఉంటున్నాయి.  అయితే, కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు తగ్గుముఖం  పట్టాయి.  

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 540 తగ్గి రూ. 37,640 కి చేరుకుంది.  కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర. 1000 తగ్గి రూ. 41,060 కి చేరుకుంది.  అయితే కేజీ వెండి ధర మాత్రం రూ. 100 పెరిగి రూ. 49,000 కి చేరుకుంది.