మళ్ళీ దిగిన బంగారం... వినియోగదారుల్లో ఆనందం 

మళ్ళీ దిగిన బంగారం... వినియోగదారుల్లో ఆనందం 

బంగారం ధరలు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి.  రెండు రోజులు ధరలు తగ్గితే ఆ తరువాత వెంటనే భారీగా ధరలు పెరుగుతున్నాయి.  మార్కెట్ లో ధరలు ఇలా పెరుగుతూ తగ్గుతుండటం ఒకందుకు మంచిదే అని అంటున్నారు విశ్లేషకులు.  గతంలో బంగారం ధరలు ఎక్కడా తగ్గకుండా అమాంతం పెరిగిపోతూ ఉండేవి.  కానీ, ఇప్పుడు ధరల్లో హెచ్చు తగ్గులు కనిపించడంతో వినియోగదారులకు కొంత ఊరట కనిపిస్తోంది.  

ఇక ఇదిలా ఉంటె, శుక్రవారం రోజున బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.970 క్షీణించింది. దీంతో పసిడి ధర రూ.38,300కు దిగొచ్చింది. అదే విధంగా  24 క్యారెట్ల బంగారం ధర   రూ. 1070 తగ్గి  రూ. 41,700కు చేరుకుంది. ఇక వెండి ధర కూడా కేజీకి రూ. 1500 తగ్గి, రూ. 49,500కు చేరుకుంది.  ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధం రావొచ్చని వార్తలు రావడంతో రెండు రోజులుగా ఈ ధరలు పెరిగాయి.  అయితే, యుద్ధం కోరుకోవడం లేదని ట్రంప్ స్పష్టం చేయడంతో బంగారం ధరలు మరలా దిగి వస్తున్నాయి.