త్వరపడండి.. పసిడి ధర భారీగా తగ్గింది..

త్వరపడండి.. పసిడి ధర భారీగా తగ్గింది..

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఎన్నడూ లేని విధంగా రూ.40 వేల మార్క్‌ను దాటేసి పరుగులు పెట్టిన 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఆల్‌టైమ్ హైని తాకిన తర్వాత.. కొన్ని రోజులుగా మళ్లీ తగ్గుముఖం పడుతోంది. ఇక ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒకేరోజు ఏకంగా రూ.600 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.38,280‌కి పడిపోయింది.. మరోవైపు 22 క్యారెట్ల బంగారు ఆభరణాలు 10 గ్రాముల ధర రూ.35,280కి పరిమితమైంది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.38,240గా.. ముంబైలో రూ.38,205గా ఉంది. మొత్తానికి మంగళవారం బంగారం ధర భారీగా తగ్గడంతో వినియోగదారులకు కాస్త ఊరట దక్కినట్టైంది. మరోవైపు.. నగల తయారీదారులు కూడా బంగారం కొనుగోలు చేసేందుకు ఉత్సాహాన్ని చూపుతున్నారు.