పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. వారంలోనే రూ.2 వేలు తగ్గుదల..

పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. వారంలోనే రూ.2 వేలు తగ్గుదల..

అమాంత పెరుగుతూ ఆల్‌టైం హై రికార్డులను తాకిన పసిడి ధర.. ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తూ పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్ చెబుతోంది.. ఈ నెల ఆరంభంలో స్టార్టింగ్ కొండెక్కిన పసిడి ధర .. ఆఖరికి దిగొచ్చింది. గత రెండు నెలలుగా.. హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోన్న బంగారం.. రెండు మూడు రోజులుగా.. తగ్గుతూ వస్తోంది. డాలర్‌తో పోలిస్తే  రూపాయి విలువ పెరగడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం మల్టీ కమాడిటీ ఎక్చేంజ్ ఇండియా వద్ద 24 క్యారెట్ల బంగారం ధర రూ.37,650కు చేరింది.

గతంలో అంతర్జాతీయంగా చైనా, అమెరికా మధ్య ట్రడ్‌ వార్‌ ముదరడంతో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఎక్కువగా ఉత్సాహం చూపించారు. అయితే లేటెస్ట్‌గా అమెరికా, చైనా మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో ఇన్వెస్టర్స్‌ బంగారం నుంచి ఇతర మార్కెట్లలోకి తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో గ్లోబెల్‌ మార్కెట్‌లో బంగారం ధర విపరీతంగా పడిపోయింది. దేశీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే.. బంగారంతో పాటుగా.. వెండి కూడా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి రూ.48,840గా ఉంది. ప్రస్తుతం  ఇదే ట్రెండ్ కొనసాగితే డిసెంబర్ నాటికి పసిడి ధర మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.