భారీగా తగ్గిన బంగారం ధర

భారీగా తగ్గిన బంగారం ధర

మార్కెట్లో గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర దిగి వచ్చింది...బులియన్ మార్కెట్‌లో ఈ వారంలో తొలి సారిగా బంగారం ధరలు తగ్గాయి..ఈక్విటీ మార్కెట్లు కోలుకోవడంతో ఈరోజు బంగారం ధరలు భారీగా పడిపోయాయి...వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది..హైదరాబాద్‌ ,విశాఖ, విజయవాడ మార్కెట్లలో నేడు బంగారం ధర రూ.50 మేర కొద్దిగా తగ్గింది...దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,170కి దిగొచ్చింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,070కి క్షీణించింది...ఢిల్లీ మార్కెట్‌లో ఈరోజు బంగారం మిశ్రమ ధరలు నమోదు చేసింది.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.47,150కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.50 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.45,950కి ఎగసింది.బంగారం రిటైల్‌ విక్రయాలు పడిపోవడం వలన కూడా ఈ ధరలు కొంతమేర దిగివచ్చాయని అంచనా వేస్తున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో అంతర్జాతీయ మార్కెట్లలోనూ బంగారం ధర తగ్గుతూ వస్తోంది.