కొండెక్కిన పసిడి ధ‌ర‌.. ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి..

కొండెక్కిన పసిడి ధ‌ర‌.. ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి..

ప‌సిడి ప‌రుగులు పెడుతోంది.. భారీగా పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తూ ఆల్‌టైం గ‌రిష్ట‌స్థాయికి చేరింది.. అమెరికా- చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ కార‌ణంగా నెల‌కొన్న ప్రతికూల పరిస్థితులు, బలహీనమైన రూపాయి వంటి అంశాలు ప‌సిడి ప‌రుగుల‌కు కార‌ణంగా విశ్లేషిస్తున్నారు మార్కెట్ నిపుణులు.. దీంతో.. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.640 పెర‌గ‌డంతో.. రూ.54,940కి ఏగ‌బాకింది.. ఇదే ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి. ఇక‌, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.590 పెర‌గ‌డంతో.. రూ.50,370కు ఎగసింది. అయితే, ఇదే స‌మ‌యంలో వెండి భారీగా ప‌త‌న‌మైంది.. రూ.2700 త‌గ్గ‌డంతో కిలో వెండి ధ‌ర రూ.62,000కు దిగివ‌చ్చింది.

ఇక‌, ఢిల్లీ మార్కెట్‌లోనూ ప‌సిడి ధ‌ర పైకే క‌దిలింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి.. రూ.51,250కు చేరుకోగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.450 పెరిగి రూ.52,450కు చేరింది. మ‌రోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.40 శాతం పైకి క‌ద‌ల‌డంతో.. బంగారం ధర ఔన్స్‌కు 1952 డాలర్లుగా ప‌లికింది.