బంగారానికి మళ్లీ రెక్కలు...హైదరాబాద్‌లో ఎంతంటే..!

బంగారానికి మళ్లీ రెక్కలు...హైదరాబాద్‌లో ఎంతంటే..!

బంగారానికి మళ్లీ రెక్కలొచ్చాయి. కొన్నిరోజులుగా కాస్త నియంత్రణలో ఉన్న ధరలు... అంతర్జాతీయ పరిణామాలు, పెరిగిన కరోనా కేసుల కారణంగా మళ్లీ అమాంతంగా పెరిగాయి. ఈక్విటీ మార్కెట్ అస్థిరత, చమురుకు పెరగని డిమాండ్ కారణంగా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు.  హైదరాబాద్‌లో స్వచ్ఛమైన బంగారం ధర 700 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములపై 700 పెరగడంతో ధర 48వేల 790కి చేరింది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ల బంగారం పది గ్రాములపై 410 రూపాయలు పెరగడంతో ధర 44వేల 720కి చేరుకుంది. వెండి ధర కూడా స్వల్పంగా మారింది. కిలో వెండిపై 50రూపాయలు తగ్గడంతో ప్రస్తుతం వెండి రేటు 48వేల 550కి చేరింది.