బంగారం ధర సరికొత్త రికార్డు..

బంగారం ధర సరికొత్త రికార్డు..

పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది.. అయినా, పసిడి కొనేవారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నగల తయారీ దారుల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఇవాళ కూడా బంగారం ధర మరింతి పెరిగింది. రోజు రోజుకీ పెరుగుతూ బంగారం ధర ఇవాళ సరికొత్త రికార్డులు సృష్టించింది. బులియన్‌ ట్రేడింగ్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.200 పెరిగింది. దీంతో.. రూ.38,770 దగ్గర ఆల్‌టైం హై రికార్డు ధరను టచ్ చేసింది. ఓవైపు అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గినా.. దేశీయ మార్కెట్‌లో మాత్రం పెరగడం గమనార్హం. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీన పడడం కూడా బంగారం ధర పెరగడానికి కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.