పసిడి ధర పైపైకి

పసిడి ధర పైపైకి

పసిడి ధర రోజు రోజుకీ ఆకాశాన్నంటుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావటంతో ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. వరసగా బంగారం ధర పెరిగుతోంది. ఈ వారంలో రూ.140 పెరిగి .. పది గ్రాముల బంగారం ధర రూ. 33,300 చేరువైంది. పెళ్లిళ్ల సీజన్‌ కావటంతో స్థానిక నగల వ్యాపారుల నుంచి బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. దీంతో ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు తెలిపారు. మరోవైపు... వెండి ధరలు మాత్రం క్షీణించాయి. నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గిపోవటంతో వెండి ధర తగ్గుతోందనే అభిప్రాయం ఏర్పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1,284.30 డాలర్లు కాగా... గత వారం ఔన్స్ ధర 1,282.30 డాలర్లు. వెండి కూడా ఒక ఔన్స్‌కు 15.41 అమెరికన్‌ డాలర్ల నుంచి 15.46కు పెరిగింది. దేశరాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛతగల 10 గ్రామాల బంగారం ధర రూ.33,200గా ఉండగా.. 99.5శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.33,050గా ఉంది. పెళ్లిళ్ల సీజన్ తో పాటు బంగారంపై పెట్టుబడులతో భద్రతకు భరోసా ఉంటుందన్న అంచనాలతో పసిడి కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపించారని ట్రేడర్లు పేర్కొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇవాళ బులియన్ మార్కెట్ కు సెలవు ప్రకటించారు.