బంగారం ధర కొత్త రికార్డులు.. లైఫ్‌ టైం హై...

బంగారం ధర కొత్త రికార్డులు.. లైఫ్‌ టైం హై...

బంగారం ధర చుక్కులు చూపిస్తోంది... క్రమంగా సామాన్యుడు కొనలేని స్థాయికి వెళ్లిపోతోంది... అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిలు, అంతర్జాతీయ పరిస్థితులులతో బంగారం ధర అమాంతం పెరిగిపోతోంది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో ఆల్‌టైం హై రికార్డును సృష్టించింది పసిడి ధర... ఇవాళ ఒకేరోజు ఏకంగా రూ.720 పెరగడంతో... 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,730కి చేరుకుని కొత్త రికార్డులు సృష్టిచింది. ఇక, శనివారం 10 గ్రాముల పసిడి ధర రూ. 41,010 వద్ద ముగియగా... ఇవాళ కొత్త రికార్డులను నెలకొల్పింది. కేవలం రెండు రోజుల వ్యవవధిలోనే 10 గ్రాముల బంగారం ధరపై రూ.1800 పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు పసిడితో వెండి కూడా పోటీ పడుతోంది.. రూ.1105 పెరగడంతో ఇవాళ కిలో వెండి రూ.49,430కి ఎగబాకింది.