పసిడికి పండుగ కళ

పసిడికి పండుగ కళ

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ బలహీనపడటంతో పాటు పండుగ సీజన్‌ కావడంతో బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో 2016 తరవాత ఒకే రోజున అత్యధికంగా బంగారం ధర (ఔన్స్‌కు 14.66 డాలర్లు) మేరకు గురువారం పెరిగింది. ఔన్స్ బంగారం ధర 1224 డాలర్ల వద్ద ఉంటోంది. ఇక పండుగ సీజన్‌ ప్రారంభం కావడంతో దేశీయంగా కూడా డిమాండ్‌ పెరుగుతోంది. స్టాక్‌ మార్కెట్‌లో అనిశ్చితి, డాలర్‌ బలహీనంతో ఇన్వెస్టర్లు కూడా బంగారంవైపు మొగ్గు చూపుతున్నారు. ఇవాళ ఢిల్లీలో పది గ్రాముల బంగారం (99.9 స్వచ్ఛత) ధర రూ. 140 పెరిగి రూ. 32,120కి చేరింది. కిలో  వెండి  ధర రూ. 500 పెరిగి రూ. 39500లకు చేరింది.