హైయ్యెస్ట్ ధర పలికిన గోల్డ్

హైయ్యెస్ట్ ధర పలికిన గోల్డ్

పసిడి మరికాస్త మిడిసిపడింది. పండుగ సీజన్ సందర్భంగా కొనుగోళ్లు పెరగడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. బుధవారం 10 గ్రాముల బంగారం మీద రూ. 150 పెరిగి రూ. 32,500కు చేరింది. దీంతో ఈ సంవత్సరం నమోదైన బంగారం ధరల్లోనే ఇవాళ అత్యధికంగా నమోదైనట్టయింది. ప్రపంచ మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్లతో పాటు స్థానిక జువెల్లర్స్ జరుపుతున్న ట్రేడింగ్స్ తో ఈ పరిణామం సంభవించింది. అటు వెండి కిలో మీద స్వల్పంగా.. అంటే రూ. 20 తగ్గి రూ. 39,730గా పలికింది. దీపావళి సమీపిస్తున్న దృష్ట్యా ఈ కొనుగోళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని, అందువల్ల బంగారం ధరలు మరికాస్త పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు ట్రేడర్లు.