భారీగా క్షీణించిన బంగారం ధర

భారీగా క్షీణించిన బంగారం ధర

అంతర్జాతీయ మార్కెట్‌ డాలర్‌ పెరగడంతో బులియన్‌ ధరలు తగ్గాయి. ఔన్స్‌ బంగారం ధర 1210 డాలర్లకు పడిపోవడంతో దేశీయంగా ఆ ప్రభావం కన్పించింది. పైగా పండుగ సీజన్‌లో కూడా డిమాండ్‌ అంతంత మాత్రమే ఉండటంతో.. పండుగ తరవాత భారీ పతనం నమోదైంది. గడచిన మూడు రోజుల్లో పది గ్రాముల బంగారం ధర రూ. 580 తగ్గింది. శనివారం రోజు రూ. 280 తగ్గి రూ. 32,070కి క్షీణించింది. వెండి కూడా అదేబాటలో పయనించింది. కిలో వెండి ధర రూ. 400 తగ్గి రూ. 38,000లకు తగ్గింది. మూడు రోజుల్లో వెండి ధర 690 రూపాయలు తగ్గింది.