వీడి తెలివి తగలెయ్య, బంగారానికి సిల్వర్ కోటింగ్ వేసి మరీ !

వీడి తెలివి తగలెయ్య, బంగారానికి సిల్వర్ కోటింగ్ వేసి మరీ !

జుట్టు ఊడిపోతుంటే, గుండును కవర్‌ చేసేందుకు విగ్గు వాడటం కామన్‌..! కానీ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కొందరు కేటుగాళ్లు.. గోల్డ్‌ స్మగ్లింగ్‌కి విగ్గును వాడుకున్నారు. ఇదే కాదు.. ఒకరు కాలి షూలో పట్టుకొస్తే.. ఇంకొకరు కడుపులో దాచుకుంటున్నారు..! చెన్నై సహా హైదరాబాదు, కేరళలోని ఎయిర్ పోర్ట్ లలో బయటపడుతున్న స్మగ్లింగ్ సంచలనంగా మారింది. దుబాయ్, షార్జా, దోహా, జెడ్డా, అబుదాబీ, రియాద్ నుంచి వచ్చిన స్మగ్లర్లు బంగారాన్ని మలద్వారం, జూసర్ మిక్సర్, కార్డ్ బోర్డ్ బాక్స్ లో దాచి గ్రీన్ ఛానెల్ ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేసి దొరికి పోయిన వార్తలు గతంలో విన్నాం. తాజాగా ఢిల్లీ విమానాశ్రయం లో 23.30 విలువ చేసే 580 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దుబాయ్ నుండి ఢిల్లీ వచ్చిన ఓ ప్రయాణీకుడు బంగారాన్ని కరిగించి తీగలుగా మార్చి వాటికి సిల్వర్ కోటింగ్ చేసి సూట్ కేసులో అమర్చాడు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుడి ప్రొఫైల్ చూసి అడ్డగించిన కస్టమ్స్ అధికారులు సూట్ కేసులో ఉన్న లగేజ్ ను పూర్తి బయటకు తీసి స్కానింగ్ చేశారు. ఈ సూట్ కేసు లో బంగారు తీగలను గుర్తించారు, సిల్వర్ కోటింగ్ చేసిన‌ బంగారం కరిగించగా వాటి విలువ 23 లక్షల 30 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్రమ బంగారం స్వాధీనం చేసుకుని ప్రయాణికుడి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు కస్టమ్స్ అధికారులు.