బడ్జెట్ ఎఫెక్ట్: భారీగా పెరిగిన పసిడి ధర..

బడ్జెట్ ఎఫెక్ట్: భారీగా పెరిగిన పసిడి ధర..

కేంద్ర బడ్జెట్ 2019-20 ఎఫెక్ట్‌తో బంగారం ధర భారీగా పెరిగింది... పసిడిపై కస్టమ్స్‌ సుంకాన్ని పెంచుతూ కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించడంతో గోల్డ్ రేట్ అమాంతం పెరిగిపోయింది. ఇవాళ ఒకేరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 590 పెరిగింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ బులియన్ మార్కెట్‌లో రూ. 34,800కు చేరింది. మరోవైపు వెండి ధర స్వల్పంగా తగ్గింది... కిలో వెండి ధర రూ. 80 తగ్గడంతో రూ. 38,500కి చేరింది.