బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం

బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం

ఈ రోజు బెజవాడ దుర్గమ్మకు భాగ్యనగరం మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ బంగారు బోనం సమర్పించింది. గత తొమ్మిది సంవత్సరాలుగా అమ్మవారికి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటూ బోనం సమర్పించారు. ఇంతకుముందు ఎపుడూ బంగారం బోనం సమర్పించలేదు. దీంతో ఈ సంవత్సర బోనానికి ప్రత్యేకత సంతరించుకుంది. పోతురాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాలతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో స్థానిక ప్రజలు, యువతీయువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.