సింహాద్రి అప్పన్నకు 'స్వర్ణ సంపెంగలు' 

సింహాద్రి అప్పన్నకు 'స్వర్ణ సంపెంగలు' 

సింహాచలం అప్పన్న స్వామికి భక్తులు సమర్పించిన విరాళాలతో దేవస్థానం అధికారులు స్వర్ణ సంపెంగలు తయారు చేయించారు. 96 మంది దాతలు సమర్పించిన రూ.82 లక్షలతో మొత్తం 132 స్వర్ణ సంపెంగ పుష్పాలను తయారు చేయించారు. ఈ కొత్త స్వర్ణ పుష్పాలతో తొలి పూజను ఈనెల 17వ తేదీన ఆలయంలో జరిగే నృసింహ జయంత్యుత్సవం సందర్భంగా చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆలయంలో ప్రతి గురు, ఆదివారాల్లో స్వర్ణ సంపెంగ పుష్పార్చన నిర్వహిస్తారు.