మహిళల వ్యాపారాల్లో గోల్డ్ మ్యాన్ శాక్స్ భారీ పెట్టుబడి

మహిళల వ్యాపారాల్లో గోల్డ్ మ్యాన్ శాక్స్ భారీ పెట్టుబడి

భారతదేశంలో వ్యాపార రంగంలో లింగ వివక్షను తగ్గించేందుకు ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ సంస్థ, గోల్డ్ మ్యాన్ శాక్స్ గ్రూప్ నడుం బిగించింది. మహిళా వ్యాపారవేత్తలు స్థాపించిన, నాయకత్వం వహిస్తున్న కంపెనీల్లో 500 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ తను సొంతంగా పెట్టుబడులు పెట్టడమే కాకుండా తన క్లయింట్లతో కూడా మహిళా వ్యాపారవేత్తల కంపెనీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టించడం, సొంతంగా నిధుల సేకరణ ప్రారంభించే మహిళలకు సీడ్ క్యాపిటల్ అందించే విధంగా సాయపడనుంది.

2008లోనే అభివృద్ధి చెందుతున్న దేశాలలోని మహిళా వ్యాపారవేత్తలకు వ్యాపార శిక్షణ, పెట్టుబడి అందించే ఉద్దేశంతో  గోల్డ్ మ్యాన్ శాక్స్ 10,000 వుమెన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా భారత్ లో మహిళా వ్యాపారవేత్తలకు పెట్టుబడులు అందిస్తోంది. ఈ కార్యక్రమానికి లాంచ్ విత్ జీఎస్ అని నామకరణం చేశారు. మంచి వ్యాపార వ్యూహాలు ఉన్నప్పటికీ పెట్టుబడులు దొరకక వెనుకంజ వేసే భారత మహిళా వ్యాపారవేత్తలకు చేయూతనిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గోల్డ్ మ్యాన్ శాక్స్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ స్టెఫానీ కోహెన్ చెప్పారు.