స్వదేశానికి మనవడు, మనవరాళ్లు.. నేడు గొల్లపూడి అంత్యక్రియలు

స్వదేశానికి మనవడు, మనవరాళ్లు.. నేడు గొల్లపూడి అంత్యక్రియలు

ప్రముఖ సినీనటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు ఈ రోజు జరగనున్నాయి. ఆయన మనవడు, మనవరాళ్లు విదేశాల నుంచి చెన్నై చేరుకున్నారు. దీంతో ఈ రోజు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు చెన్నైలో గొల్లపూడి మారుతీరావుకు తెలుగు సినీ పరిశ్రమ నివాళులర్పించింది. సినీ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. చిరంజీవి, సుహాసిని, సింగితం శ్రీనివాసరావు సహా పలువురు ప్రముఖులు గొల్లపూడి భౌతికకాయన్ని సందర్శించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.