ఇండియాలో దుమ్ము దుమారమే !
భారతదేశం నుంచి వందల కోట్ల సొమ్ముల్ని విదేశాలకు ఎత్తుకెళుతున్నాయి హాలీవుడ్ సినిమాలు. 3డి సినిమాల వెల్లువకు మన ప్రేక్షకులు అడిక్ట్ అయిపోయారు. ఆ క్రమంలోనే 2016లో రిలీజైన `జంగిల్‌బుక్` సినిమాతో అసలు కథ మొదలైంది. ఆ సినిమా ట్రేడ్ విశ్లేషకుల అంచనాల్ని తలకిందులు చేస్తూ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300కోట్లు వసూలు చేసింది. అవతార్ తర్వాత ఆ రేంజులో విజయం అందుకుందీ చిత్రం. అటుపై ఇక హాలీవుడ్ హవాకు ఏమాత్రం బ్రేక్ పడలేదు. ఈ ఏడాదిలో రిలీజైన బ్లాక్ పాంథర్, జురాసిక్ వరల్డ్ 2, అవెంజర్స్ 2, ఇన్‌క్రెడిబుల్స్ 2, యాంట్‌మ్యాన్ అండ్ ది వాస్ప్ చిత్రాలు ఇండియాలో బంపర్ కలెక్షన్స్ సాధించాయి.
ఆ కోవలోనే ఇప్పుడు `మిషన్ ఇంపాజిబుల్- ఫాలౌట్` రిలీజ్‌కొస్తోంది. ఈనెల 27న మన దేశంలో 2డి, 3డిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే కొత్త టీజర్లు దుమారం రేపుతున్నాయి. టామ్ క్రూజ్ అసాధారణ యాక్షన్ విన్యాసాలు కట్టిపడేస్తున్నాయి. సినిమా ఆద్యంతం గగుర్పొడిచే సాహస విన్యాసాలకు కొదవే ఉండదని ట్రైలర్లు చెబుతున్నాయి. ఇక లేటెస్ట్ టీజర్‌ని రిలీజైన రెండు మూడు రోజుల్లోనే కోటి 7లక్షల మంది చూశారంటే క్రేజు ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. మిషన్ ఇంపాజిబుల్ సిరీస్‌లో వస్తున్న `ఫాలౌట్` ఇండియా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)