మెగా హీరోకి మంచి రోజులొచ్చాయి !

మెగా హీరోకి మంచి రోజులొచ్చాయి !

 

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కెరీర్ గత రెండేళ్లుగా చప్పగా సాగుతోంది.  ఈ రెండేళ్ల కాలంలో ఆయన సక్సెస్ అనే మాటనే వినలేకపోయారు.  దీంతో కొంచెం గ్యాప్ తీసుకుని కిశోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' అనే సినిమా చేశాడు.  సినిమా టీజర్ నిన్ననే విడుదలైంది.  భిన్నమైన వ్యక్తుల జీవితాల ఆధారంగా సాగే కథే ఈ సినిమా.  టీజర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది.  24 గంటల్లోనే 3.5 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది.  ప్రేక్షకులు, అభిమానులు ఇన్నాళ్లకు తేజ్ ట్రాక్ మార్చి మంచి కథను చూజ్ చేసుకున్నట్టున్నాడని, ఈసారి హిట్ పక్కా అంటున్నారు.  ఆ కాంప్లిమెంట్స్ తో తేజ్ సైతం సూపర్ హ్యాపీగా ఉన్నాడు.  ఆ కాంప్లిమెంట్స్ తో తేజ్ సైతం సూపర్ హ్యాపీగా ఉన్నాడు.