ప్రైవేట్‌ టీచర్లకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్‌

ప్రైవేట్‌ టీచర్లకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్‌

కరోనావైరస్, లాక్‌డౌన్‌ అన్ని రంగాలతో పాటు విద్యారంగంపై కూడా తీవ్ర ప్రభావాన్నిచూపింది.. ప్రభుత్వ టీచర్లకు జీతాలు అందినా.. ప్రైవేట్ టీచర్ల పరిస్థితి మాత్రం దారుణంగా మారిపోయింది.. అటు స్కూళ్ల నుంచి జీతాలు రాక.. ఇతర ఆధారం లేక అవస్థలు తీస్తున్నారు. అయితే, ప్రైవేట్‌ టీచర్లకు, సిబ్బందికి శుభవార్త చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు.. . కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రతినెలా రూ.2వేల నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేయనున్నట్టు వెల్లడించారు.. దీంతో రాష్ట్రంలోని లక్షా 45వేల మంది ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి లబ్దిచేకూరనున్నట్టు తెలిపారు సీఎం కేసీఆర్. గుర్తింపుపొందిన ప్రైవేట్ స్కూళ్ల టీచర్లు, సిబ్బందికి ఇది వర్తించనుండగా.. టీచర్లు తమ బ్యాంక్ అకౌంట్‌తో కలెక్టర్ల దగ్గర దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్.