గ్రామ వాలంటీర్లకు గుడ్‌న్యూస్‌..!?

గ్రామ వాలంటీర్లకు గుడ్‌న్యూస్‌..!?

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. దీని కోసం పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించింది.. ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా చూడడం, పారదర్శకంగా సేవలందించడమే వీరి లక్ష్యంగా కాగా.. ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు చేసుకునే ప్రతీ దరఖాస్తును గ్రామ వాలంటీర్లు పరిశీలించిన తర్వాత గ్రామ సచివాలయం ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గ్రామ వాలంటీర్లు ఇప్పుడు కీలకంగా మారిపోయారు. అయితే, వీరికి ప్రభుత్వం త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. వాలంటీర్లకు రూ. 5 వేల గౌరవవేతనం ఇవ్వాలని వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయించగా.. అయితే వీరికి పనిభారం ఎక్కువైందనే విమర్శలున్నాయి. కొందరు ఈ జాబ్‌లో చేరేందుకు ఆసక్తి కూడా చూపడం లేదట.. నిరంతరం ప్రజా సేవలో ఉండాల్సిన వాలంటీర్లకు రూ.5 వేల గౌరవవేతనం మాత్రమే ఏంటని? ప్రశ్నిస్తున్నారు. ఇక, వాలంటీర్ల ఇబ్బందులను గుర్తించిన ఏపీ సర్కార్.. గౌరవేతనాన్ని పెంచాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.. వాలంటీర్లకు ఇచ్చే మొత్తానికి కనీసం రూ. 8 వేలకు పెంచాలనే యోచనలో సీఎం వైఎస్ జగన్ ఉన్నారని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.