వైఎస్ఆర్ అభిమానులకు శుభవార్త !

వైఎస్ఆర్ అభిమానులకు శుభవార్త !

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కిస్తున్న చిత్రం 'యాత్ర'.  వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటిస్తున్న ఈ సినిమాపై వైఎస్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.  ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకోగా ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అంతా.  వారి కోసమే రేపు 7వ తేదీన సాయంత్రం 5 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది.  ఫిబ్రవరి 8వ తేదీన విడుదలకానున్న ఈ చిత్రంలో వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు.