అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ తీపి కబురు అందించింది. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విధంగానే తొలుత పదివేల లోపు డిపాజిటర్లకు ప్రభుత్వమే నేరుగా సొమ్ము చెల్లించనుంది. ఈ చెల్లింపుల కోసం 2 వందల 69 కోట్ల 99 లక్షల రూపాయలను మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. తొలిదశలో 3 లక్షల 69 వేల 6 వందల 55 మందికి డబ్బు జమ కానుంది. కోర్టు ఆదేశించినట్టుగా జిల్లా లీగల్‌ సెల్‌ల ద్వారా ఈ డబ్బును బాధితులకు అందిస్తారు. మరోవైపు ఇరవై వేల లోపు  డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులను కూడా న్యాయస్థానం ఆదేశాల మేరకు సర్కారు ఆదుకోనుంది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌కుమార్‌ ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.