కేంద్రం శుభ‌వార్త‌... ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు ఊరట

కేంద్రం శుభ‌వార్త‌... ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు ఊరట

ఉద్యోగులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఊర‌ట క‌ల్పించే నిర్ణ‌యం తీసుకుంది ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం.. చిన్న మొత్తాల పొదుపు పథకాలు (స్మాల్ సేవింగ్ స్కీమ్స్)పై వడ్డీ రేట్లను యథావిథిగా కొనసాగిస్తున్నట్టుగా ప్ర‌క‌టించింది.. జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి ఇది వ‌ర్తించ‌నుంది.. ఇందులో గొప్ప ఏంటి అంటే.. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వ‌డ్డీ రేట్లు త‌గ్గిస్తార‌నే చ‌ర్చ సాగింది.. మ‌రోవైపు ప‌లు నివేదిక‌లు కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేశాయి.. కానీ.. కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం.. వ‌డ్డీ రేట్ల‌ను స్థిరంగానే కొన‌సాగించి ఊర‌ట క‌ల్పించింది.. మోడీ స‌ర్కార్ తాజాగా నిర్ణ‌యంతో.. పీపీఎఫ్ ఖాతాల‌పై వ‌డ్డీ రేటు 7.1 శాతం వడ్డీ ల‌భించ‌నుండ‌గా.. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పై 7.4 శాతం వడ్డీ, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై 5.5 శాతం నుంచి 6.7 శాతం మధ్యలో వడ్డీ పొందుతారు.. ఇక‌, కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో 6.9 శాతం, సుకన్య సమృద్ధి యోజనలో 7.6 శాతం వడ్డీ ల‌భించ‌నుంది.. కాగా, ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లను భారీగా కోత‌పెట్టిన విష‌యం తెలిసిందే.