'మజిలీ'కి భారీ ప్రీ పిలీజ్ బిజినెస్ !

'మజిలీ'కి భారీ ప్రీ పిలీజ్ బిజినెస్ !

నాగ చైతన్య నటిస్తున్న కొత్త సినిమా 'మజిలీ'.  శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇందులో చైతన్యకు జోడీగా సమంత నటిస్తోంది.  పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంచేత ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది.  అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగిందట.  సినిమా శాటిలైట్ హక్కులను 5 కోట్లకు జెమినీ దక్కించుకోగా అమెజాన్ డిజిటల్ హక్కుల్ని 3.5 కోట్లకు కొనుగోలు చేసిందట.  అలాగే హిందీ డబ్బింగ్ రైట్స్ సైతం 4 కోట్ల వరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.  ఏప్రిల్ 5వ విడుదలకానున్న ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.