పవన్ ను చూసి ఏడ్చేసిందట..!!

పవన్ ను చూసి ఏడ్చేసిందట..!!

పవన్.. మొదటి సినిమా "అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి".  ఈ సినిమా వచ్చి 22 సంవత్సరాలైంది.  ఇందులో అక్కినేని మనవరాలు సుప్రియ హీరోయిన్.  ఆమె హీరోయిన్ గా అదే మొదటి సినిమా ఆ తరువాత తెరపై కనిపించలేదు.  22 సంవత్సరాల తరువాత అడవి శేషు గూఢచారిలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది.  

పవన్ తో చేసిన మొదటి సినిమాలో మొదట సుప్రియనే డబ్బింగ్ చెప్పుకుంది.  కానీ, వాయిస్ పర్ఫెక్ట్ గా సెట్ కాకపోవడంతో వేరొకరితో డబ్బింగ్ చెప్పించారట.  సెట్స్ లో పవన్ చాలా సిగ్గుపడేవాడని చెప్పింది.  కళ్ళజోడు పెట్టుకొని నటించేవాడని.. ఎక్స్ ప్రెషన్స్ అర్ధంగాక కళ్ళజోడు తీసెయ్యమని పవన్ తో గొడవపడినట్టు సుప్రియ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నది.  సినిమాలో చేతులమీద నుంచి కార్లు పోనిచ్చుకునే సన్నివేశం ఉంది.  దానిని డూప్ లేదా కెమెరా ట్రిక్ తో తీస్తారేమో అనుకుందట.  కానీ, నిజంగానే పవన్ చేతుల మీదుగా వరసగా కార్లు వెళ్లడం చూసి సుప్రియ ఏడ్చేసిందట.  అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి తరువాత సెకండ్ సినిమా బాలకృష్ణ మైనా సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని.. సినిమాల్లో చేయడం ఇష్టం లేక వదిలేసుకున్నట్టు సుప్రియ పేర్కొంది.