మహేష్ సినిమాలో గూఢచారి హీరో..!!

మహేష్ సినిమాలో గూఢచారి హీరో..!!

హీరోగా బిజీగా ఉన్న మహేష్ బాబు సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.  శ్రీమంతుడు సినిమాకు మహేష్ బాబు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.  ఆ తరువాత బ్రహ్మోత్సవం సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.  బ్రహ్మోత్సవం ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే.  

మరలా మహేష్ బాబు తన నిర్మాణ సంస్థ మహేష్ బాబు సినిమా ప్రొడక్షన్స్ లో సినిమాలు చేయబోతున్నాడు.  అయితే, హీరోగా కాదు.  నిర్మాతగానే.  మహేష్ ప్రొడక్షన్స్ లో ఓ వెబ్ సీరీస్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.  ఈ వెబ్ సిరీస్ నే కాకుండా మహేష్ స్ట్రెయిట్ మూవీని కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.  క్షణం, గూఢచారి వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న అడవి శేష్ హీరోగా మహేష్ బాబు సినిమాను నిర్మించబోతున్నాడని వినికిడి.  

గూఢచారి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడని సమాచారం.  ఈ సినిమా గురించి త్వరలోనే అఫిషియల్ ఎనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉంది.