ఏపీ రైతులకు మరో శుభవార్త

ఏపీ రైతులకు మరో శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రైతులకు మరో శుభవార్త. రైతు రుణమాఫీ పథకం కింద నాలుగో విడత నిధులు విడుదలయ్యాయి. ఈమేరకు రూ.3,900 కోట్లు విడుదల చేసినట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. మొత్తం 30లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ.39వేల చొప్పున జమ చేశామన్నారు. రైతులు రుణ అర్హత పత్రంతో బ్యాంకుకు వెళ్లి నమోదు చేసుకుంటే.. వడ్డీతో సహా ఇస్తారని చెప్పారు. ఏడాదికి 10శాతం వడ్డీతో సహా రైతు రుణమాఫీ పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించారు. మొత్తం 58.32 లక్షల మంది రైతుల్లో 23.76 లక్షల మందికి తొలి విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పిన కుటుంబరావు.. మే 23వ తేదీలోగా ఐదో విడత రుణమాఫీ నిధులు కూడా విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఖరీఫ్‌లోగా అన్నదాత సుఖీభవ క్లియర్ చేస్తామని కుటుంబరావు వివరించారు.