మెట్రో ప్రయాణికులకు శుభవార్త

మెట్రో ప్రయాణికులకు శుభవార్త
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. శనివారం నుంచి మియాపూర్‌- అమీర్‌పేట్‌- నాగోల్‌ మధ్య రద్దీ సమయాల్లో 7 నిమిషాలకో మెట్రో టైన్‌ నడవనుంది. రద్దీ లేని సమయాల్లో ప్రతి 8 నిమిషాలకు ఒక రైలు బయల్దేరనుంది. ఈ విషయాన్ని ఐటీ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. కొత్త సిగ్నలింగ్ వ్యవస్థకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ(సీఎంఆర్‌ఎస్) అనుమతి ఇచ్చిందని కేటీఆర్‌ తెలిపారు. ఈ విషయాన్ని నగర ప్రయాణికులతో పంచుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్‌ అన్నారు. https://twitter.com/KTRTRS/status/987266214488666113