ఒకేసారి 2 భాషలకు స్పందించే "అసిస్టెంట్"

ఒకేసారి 2 భాషలకు స్పందించే "అసిస్టెంట్"

సామాజిక, ఆర్థిక, టెక్ రంగల్లో దూసుకుపోతున్న గూగుల్ మరో కొత్త ఒరవడిని సృష్టించబోతోంది. స్మార్ట్ ఫోన్ యూజర్స్ కు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన గూగుల్ అసిస్టెంట్ ను మరింత డెవలప్ చేసి ఒకేసారి రెండు భాషల్లో రెస్పాండ్ అయ్యేలా తీర్చిదిద్దారు. ఇప్పటికైతే ఇంగ్లిష్ తో పాటు జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, జపనీస్ లాంగ్వేజెస్ కు "గూగుల్ అసిస్టెంట్"ను రూపొందించామని రానున్న రోజుల్లో మరిన్ని భాషల్ని కూడా  ఆ సౌకర్యంలోకి తీసుకొస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఒకేసారి రెండు భాషలకు అసిస్టెంట్ రెస్పాండ్ అయ్యేందుకు లాంగ్వేజ్ ఐడెంటిఫికేషన్ మోడల్ ను తయారు చేశారు. వచ్చే వారం బెర్లిన్ లో కొత్త గూగుల్ అసిస్టెంట్ ను ప్రదర్శించబోతున్నారు.